ఇండోనేషియా, జపాన్‌లలో భూకంపం
- June 24, 2019
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్‌లోని సోలంకి సముద్ర తీరం వద్ద భూకంపం తీవ్రత 7.5 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో సంభవించింది.
యాంబన్‌కు దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214 కి.మీ. లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30 నిమిషాల కన్నా ఎక్కువే భూమి ప్రకంపించింది. అక్కడ సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వం తెలపడంతో సునామీ పరిధిలోని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సోమవారం తెల్లవారుఝామున జపాన్‌లోనూ భూకంపం చోటు చేసుకుంది. 5.5 తీవ్రతతో ఇది సంభవించినట్లు జపాన్ శాస్త్రవేత్తలు ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..