వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయనున్న షార్జా పోలీసులు

- June 24, 2019 , by Maagulf
వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయనున్న షార్జా పోలీసులు

వాహనదారులకు అత్యవసర సందేశాలను ప్రసారం చేయడానికి షార్జా పోలీసులు ఆదివారం కొత్త రేడియో ఆధారిత సేవను ప్రారంభించారు. ఈ సేవ అన్ని పోలీసు పెట్రోలింగ్‌లలో జూలై 1 నుండి లభ్యమవుతుంది.

సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్ మాట్లాడుతూ, ఈ పరికరం రేడియో తరంగాల ద్వారా పరిసర వాహనాలకు వివిధ భాషలలో సందేశాలను పంపుతుంది. పెట్రోలింగ్‌కు/పెట్రోలింగ్ వాహనం వస్తున్నట్లు వాహనదారులకు తెలియజేస్తూ వారికి దారి ఇవ్వవలసిందిగా సూచిస్తుంది. దీనిద్వారా అతి తక్కువ సమయంలో ఎమెర్జెనీ ప్రదేశానికి పోలీసులు చేరుకోవచ్చని తెలిపారు. 

ఈ పరికరంలో రికార్డ్ చేయబడిన మూడు ఆడియో క్లిప్‌లు కలిగి ఉంటాయి. వాటిని ఇలా వివరించారు డాక్టర్ అహ్మద్ సయీద్ అల్ నౌర్:

  1. మొదటి సందేశం వాహనదారులను సమీపించే పోలీసు లేదా అత్యవసర వాహనం ఉనికిని హెచ్చరిస్తుంది.
  2. రెండవది అత్యవసర లేదా పోలీసు వాహనం ముందు నిలిపి ఉంచినట్లు వారిని హెచ్చరిస్తుంది.
  3. మూడవది పోలీసు వాహనం జంక్షన్ కు చేరుకున్నప్పుడు వాహనదారులను ఆపమని అభ్యర్థిస్తుంది.

ఈ సందేశాలను పాటించి ప్రతి వాహనదారుడు పోలీసు, అత్యవసర మరియు అధికారిక కాన్వాయ్ వాహనాలకు దారి వదిలి, అధికారులకు మెరుగైన సేవ అందించేందుకు సహకరించవలసినదిగా కోరారు.

ఈ సందేశాలను ఖాతరు చేయక/అడ్డుకునే వాహదారులకు 3 వేల డాలర్ల జరిమానా విధించబడతారని, వారి వాహనాలను ఆరు ట్రాఫిక్ పాయింట్లతో పాటు 30 రోజుల పాటు నిర్బంధించనున్నట్లు బ్రిగ్ అల్ నౌర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com