సౌదీ అరేబియాలో శాశ్వత నివాసం కోసం వలసదారులకు ఛాన్స్‌

సౌదీ అరేబియాలో శాశ్వత నివాసం కోసం వలసదారులకు ఛాన్స్‌

సౌదీ అరేబియాలోని ప్రీమియమ్‌ రెసిడెన్సీ సెంటర్‌, తమ సేవలను ఆదివారం నుంచి ప్రారంభించింది. ఎలక్ట్రానిక్‌ విధానంలో అప్లికేషన్లను ప్రాసెసింగ్‌ చేయడం, ప్రీమియమ్‌ రెసిడెన్సీ సిస్టమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటివి ఈ కేంద్రంలో అందుబాటులో వుంటాయి. కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ సౌద్‌ నాయకత్వంలోని కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ జారీ చేసిన డిక్రీకి అనుగుణంగా ఈ సేవల్ని ప్రారంభించారు. కాంప్రహెన్సివ్‌ ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌ 'ఎస్‌ఎపిఆర్‌సి' ద్వారా ఎవరైతే సేవల్ని పొందాలనుకుంటున్నారో, వారికి ఈ కేంద్రంలో అన్ని సేవలూ లభిస్తాయి. రెండు రకాల ప్రీమియమ్‌ రెసిడెన్సీలను ఈ సెంటర్‌ అందిస్తుంది. పర్మనెంట్‌ ప్రీమియమ్‌ రెసిడెన్సీ - వన్‌ టైమ్‌ లైఫ్‌టైమ్‌ ఫీజు. టెంపరరీ ప్రీమియమ్‌ రెసిడెన్సీ - ఏడాది రుసుముకుగాను. సౌదీలో సెటిలైపోయి, తమ వ్యాపారాల్ని విస్తరించుకోవాలనుకునేవారికి ప్రీమియమ్‌ రెసిడెన్సీ ఉపకరిస్తుంది. ఈ సెంటర్‌ ఫైనాన్షియల్‌గా అడ్మినిస్ట్రేటివ్‌ పరంగా ఇండిపెండెంట్‌ ఎన్‌టైటీ - కౌన్సిల్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌తో అసోసియేట్‌ అయి వుంటుంది. 

Back to Top