జాబ్‌ పోర్టల్‌తో కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించిన ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌

- June 29, 2019 , by Maagulf
జాబ్‌ పోర్టల్‌తో కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించిన ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌

దోహా: భారత రాయబారి పి.కుమరన్‌, ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఐసిసి) కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో జాబ్‌ పోర్టల్‌ని కూడా పొందుపరిచారు. కమ్యూనిటీ జాబ్‌ సీకర్స్‌ ఎవరైనా తమ రెజ్యూమ్స్‌ని ఈ జాబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. ఎంప్లాయర్స్‌ తమ వెబ్‌సైట్‌ని సందర్శించి, అర్హులైనవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా డేటాబేస్‌ ఇక్కడ అందుబాటులో వుంటుంది. ఇండియా, ఖతార్‌ సంబంధిత టూరిజం, బిజినెస్‌ సహా పలు ముఖ్యమైన అంశాలకు సంబంధించిన లిక్‌లు కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి ఐసిసి కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ కంబాలె కూడా హాజరయ్యారు. ఐసిసికి చెందిన మేనేజ్‌ కమిటీ టీమ్‌ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com