బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసి మర్చిపోతున్నారా.. ఓసారి చెక్ చేసుకోండి..
- July 02, 2019
ఇండియా:పైసా పైసా కూడబెడతారు. అవసరానికి అక్కరకొస్తాయని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. మరి వాటిని అలాగే మర్చిపోతున్నారట. ఒక్క ఎస్‌బీఐలోనే 2018 చివరి నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ రూ.2వేల 156.33 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2016లో రూ.8వేల 928 కోట్లు ఉంటే.. 2017లో వీటి విలువ రూ.11వేల 494 కోట్లు ఉందని ఆమె ప్రకటించారు.
ఇక ఇన్సూరెన్స్ సెక్టార్‌లో అయితే సెప్టెంబర్ 2018 చివరి నాటికి రూ.16వేల 887.66 కోట్లు, మరి కొన్ని బీమా పాలసీల్లో రూ.989 కోట్లు చొప్పున క్లెమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు.
ఆర్‌బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం.. 1949లో సెక్షన్ 26ఏ ప్రకారం.. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్లను, వాటి వడ్డీలతో కలిపి ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్) కు బదిలీ చేస్తారని మంత్రి తెలిపారు. కాగా, డిపాజిట్ గడువు పూర్తయినా డిపాజిట్ దారులు రాకపోవటం ఏంటనే ప్రశ్న తలెత్తగా.. దానికి బ్యాంకు అధికారులు.. కుటుంబ సభ్యులకు తెలియకుండా డిపాజిట్ చేసే వారు కొందరైతే.. మర్చిపోయే వారు కొందరు.. మరణించేవారు కొందరు, బినామీలుగా ఉండి డిపాజిట్ చేయడం వంటి పలు కారణాలు చెబుతున్నారు. ఇలా వివిధ కారణాలతో డిపాజిట్ సొమ్ము క్లయిమ్ చేసుకోవడం లేదని అంటున్నారు. ఈ విధంగా బ్యాంకుల్లో ప్రజల సొమ్ము రూ.15వేల కోట్లు ఉందని అంటున్నారు. మరి మీ డిపాజిట్లేమైనా ఉన్నాయోమో ఓ సారి చెక్ చేసుకుని బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోండి. లేకపోతే బ్యాంకులు తీసేసుకుంటాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







