క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు నేర్చుకునే పనిలో బిజీ..

- January 05, 2016 , by Maagulf
క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు నేర్చుకునే పనిలో బిజీ..

తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుండడంతో ప్రక్క రాష్ట్రాల స్టార్స్ టాలీవుడ్‌లో నటించేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ నేపధ్యంలో కొందరు హీరోలు తెలుగు భాషను నేర్చుకునేందుకు మక్కువ ఎక్కువగా చూపిస్తున్నారు. ఇప్పటికే మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ చిత్రం కోసం తెలుగు నేర్చుకుంటుండగా, క్రికెటర్ శ్రీశాంత్ కూడా తన తాజా చిత్రం కోసం తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన శ్రీశాంత్ ఇప్పుడు వెండితెరపై విలన్లపాలిట యముడిగా మారనున్నారు. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో శ్రీశాంత్ హీరోగా మల్టీలింగ్యువల్ మూవీ తెరకెక్కుతుండగా, ఈ చిత్రం కోసం శ్రీశాంత్ తెలుగు నేర్చుకుంటున్నారట.తన డైలాగులకు ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకునేందుకు రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్న యాక్టింగ్ వర్క్ షాప్‌లో జరుగుతున్న మూడు రోజుల కార్యక్రమానికి రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నారట. అంతేకాదు తెలుగు త్వరగా వచ్చేందుకు ఓ ట్యూటర్ దగ్గర శిక్షణ కూడా పొందుతున్నారట.తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం శ్రీశాంత్ కొంచెం బరువు తగ్గాడట. వడి వడిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు జనవరి నెలాఖరులో గుమ్మడి కాయ కొట్టనుండగా, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com