అమెరికా:రేపటి నుండి వలసవాసులపై దాడులు..
- July 03, 2019
వాషింగ్టన్:ఈ నెల 4వ తేదీ తరువాత తమ దేశంలో వున్న అక్రమ వలసవాసు లందరిపై దాడులు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జులై 4 తరువాత తమ దేశంలో చట్టవిరుద్ధంగా వుంటున్న వారందరినీ వెనక్కి పంపే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సెంట్రల్ అమెరికా నుండి వచ్చే అక్రమ వలస వాసులను వెనక్కి పంపేందుకు, సరిహద్దుల నిర్వహణకు అవసరమైన 460 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపు బిల్లును ఆయన ఆమో దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అక్రమ వలసల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నేతలు కలిసి కృషి చేస్తారన్న ఉద్దేశంతో తాము ఈ దాడులను రెండు వారాల పాటు వాయిదా వేశామని చెప్పారు. ఈ రెండు వారాల గడువు నాలుగవ తేదీతో ముగుస్తున్నప్పటికీ ఇరుపార్టీల నేతల నుండి ఇప్పటి వరకూ తగిన స్పందన రాలేదని ఆయన చెప్పారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ) విభాగం రూపొందిం చిన ప్రణాళిక ప్రకారం దేశంలోని లాస్ఏంజెల్స్, హోస్టన్, చికాగో, మియామీ, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో తదితర పది నగరాల్లో అక్ర మంగా నివశిస్తున్న దాదాపు 2 వేల కుటుంబా లకు చెందిన వారిని వెనక్కి పంపనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కారు చేపట్టిన ఈ చర్య అనేక కుటుంబాలను విడదీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో తాము ఇందుకు సహకరించబోమని చికాగో, లాస్ఏంజెల్స్ నగర మేయర్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!