పిల్లలపై లైంగిక నేరాలకు మరణశిక్ష!

- July 11, 2019 , by Maagulf
పిల్లలపై లైంగిక నేరాలకు మరణశిక్ష!

ఢిల్లీ: చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో (పొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని పటిష్ఠం చేస్తూ పలు సవరణలను ఆమోదించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా పోక్సో చట్టం-2012 లోని పలు సెక్షన్లకు సవరణలు చేశామన్నది. చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడితే మరణశిక్ష సహా కఠిన శిక్షలు విధించేలా 4,5,6 సెక్షన్లలో సవరణలు చేశామన్నది. ప్రకృతి విపత్తుల వేళ హార్మోన్లు/ రసాయనాలతో చిన్నారులకు త్వరగా సెక్సువల్ మెచ్యూరిటీ వచ్చేలా చేసే నేరాల నియంత్రణకు సెక్షన్ 9... చైల్డ్ పోర్నోగ్రఫీ సామగ్రి ధ్వంసం/డిలీట్ చేయకుండా, రిపోర్ట్ చేయకుండా ఉంటే జరిమానాలు/ జైలు శిక్షలకు 14,15 సెక్షన్లను సవరించామన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com