టెర్రరిజం అభియోగాలు: 11 మందికి జైలు శిక్ష
- July 13, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, 11 మంది బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. తీవ్రవాదంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతోపాటు, ఆయుధాల్ని, పేలుడు పదార్థాల్ని కలిగివున్నారన్న అభియోగాలూ వీరిపై మోపబడ్డాయని చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. వీరిలో ఐదుగురికి పదేళ్ళ జైలు శిక్షతోపాటు, ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఐదుగురికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది న్యాయస్థానం. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్పై దాడికి నిందితులు యత్నించారు. సోషల్ మీడియా వేదికగా నిందితులు తీవ్రవాదాన్ని ప్రమోట్ చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







