నివాసితుల కోసం జి.సి.సి. డ్రైవింగ్ లైసెన్స్ ప్రత్యేక పరీక్ష
- January 05, 2016
గల్ఫ్ దేశాల సమాఖ్య డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న నివాసితులు ఎవరైనా నేరుగా జరిగే ప్రత్యేక పరీక్ష లో పాల్గొనవచ్చని దోహా లోని పలు డ్రైవింగ్ స్కూళ్ళ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఒక ప్రముఖ డ్రైవింగ్ స్కూల్ సూపర్ వైజేర్ గల్ఫ్ టైమ్స్ దినపత్రిక తో మాట్లాడుతూ, భారీ వాహానాల డ్రైవర్ లతో సహా, ఈ, నియమం అందరు జాతీయులకు వర్తిస్తుందని తెలిపారు. జి.సి.సి. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియబడిన డ్రైవర్లు, ఈ నేరుగా నిర్వహించబడే పరీక్ష కు అనుమతించబడరని ఆమె తెలిపారు. అటువంటివారికి ఉన్న ఏకైక ఐచ్చికం ఏమిటంటే, వారు మళ్ళి డ్రైవింగ్ స్కూల్ లో చేరి సంబంధిత కోర్సును పూర్తిగానో లేక సగమో పూర్తి చేసి ఆ తర్వాత పరీక్ష కు హాజరై ఉత్తీర్ణులై లైసెన్స్ ను పొందవచ్చని తెలిపారు. ఈ తరహా నిర్ణయ విధానం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే , పరిణితి లేని డ్రైవర్ల సంఖ్య నానాటికీ గణనీయంగాపెరిగిపోతున్న కారణంగా, నైపుణ్యం కలిగిన కలిగిన డ్రైవర్ లను క్రమబద్దీకరెంచేదుకు ప్రత్యేక పరీక్ష విధానం అమలులోనికి తిసుకోనివచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారు విధిగా అన్నిపత్రాలను ట్రాఫిక్ శాఖకు అందచేయాల్సిఉంది. గల్ఫ్ దేశాల సమాఖ్య డ్రైవింగ్ లైసెన్స్ తో ,వచ్చినవారు నూతన నిబంధనల ప్రకారం, ఇకపై జి.సి.సి. లైసెన్స్ ను ఇక్కడ మార్చడం ఏ మాత్రం సాధ్యం కాదు. దుబాయ్, సౌదీ అరేబియా నుంచి దోహా కు కొత్తగా వచ్చినవారు ఈ ప్రత్యేక పరీక్షకు నెలరోజుల పాటు శిక్షణలో పాల్గొనాలి. ఈ సందర్భంగా శిక్షణకు వచ్చిన అభ్యర్ధి తన అనుభవాలను పంచుకొంటూ, డిసెంబర్ 16వ తేదీ థీయరీ ( కంప్యూటర్ ) ." ఎల్ " పార్కింగ్ పరీక్షను పూర్తి చేసినట్లు చెబ్తూ, జనవరి 13వ తుది వాస్తవ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు తాను హాజరవబోతున్నట్లు తెలిపాడు. ఈ ప్రత్యేక పరీక్షలో కనుక ఎవరైనా అభ్యర్ఢి ఉత్తీర్ణుడు కాకపోతే , మొత్తం కోర్సును తిరిగి పూర్తి చేసి మరల పరీక్షకు హాజరు కావల్సిందేనని అన్నారు. ప్రస్తుతం ఖతర్ లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే , ఆ ప్రక్రియ చాల కష్టమని , డ్రైవింగ్ పరీక్ష తో ఉత్తీర్ణులు కాని వారికి , సగం డ్రైవింగ్ కోర్సును పూర్తి చేసిన వారికి ఖతర్ లో వాహనం నడపడం ఎంతో దుర్లబమని , వారి ప్రాంతాలలో నడిపింత సులభంగా ఈ ప్రాంతాలలో నడపలేరని పేర్కొంటూ , అక్కడకు ఇక్కడకు డ్రైవింగ్ విధానం లో ఎంతో తేడా ఉందని అన్నారు. అందుకే , వారు పలుమార్లు శిక్షణ తీసుకొంటున్నా పరీక్షలో తప్పుతున్నట్లు వివరించారు. డ్రైవింగ్ కోర్స్ పూర్తి చేసినప్పటకి, రెండు మూడు నెలలు వరకు తుది పరీక్ష కోసం వేచి ఉండాలి. 162 కేటగిరి లో ఉన్న కార్మికులకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు వీలు లేని నిషేధం ఉంది. డ్రైవింగ్ పాటశాలలో చేరకోరేవారు అక్కడ చేర్చుకొనే వారికి ఖతర్ గుర్తింపు పత్రాన్ని అందచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డ్రైవింగ్ స్కూల్ కు నిత్యం అర్హత కలిగిన వారు ఎందరో వస్తునారు అయెతే, ఈ డ్రైవింగ్ లైసెన్స్ ప్రత్యేక పరీక్ష లో ఉత్థీర్ణ్లలయ్యెవారు తక్కువ శాతం మందే ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







