ఒమన్ నుంచి వలస కుటుంబాల నిష్క్రమణ
- January 05, 2016
ఒమన్‌లో పెరిగిపోతున్న 'కాస్ట్ ఆఫ్ లివింగ్' అక్కడి వలస కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తోంది. సబ్సిడీలు ఎత్తివేయడం, అధిక పన్నులు విధిస్తుండడంతో తమ జీవనం కష్టమవుతోందని వలస కుటుంబాలు అంటున్నాయి. తన కుటుంబాన్ని భారతదేశానికి పంపించేస్తున్నానని కేరళ నుంచి వచ్చి ఒమన్‌లో స్థిరపడ్డ అస్రాఫ్ అహ్మద్ అనే వ్యక్తి చెప్పాడు. తన జీతం 620 ఒమన్ రియాల్స్ మాత్రమేననీ, జీవనం భారమైపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అతను అన్నాడు. చంద్ర అనే ఇంకో వ్యక్తి, ఇప్పటికే తన కుటుంబాన్ని ఇండియాకి పంపించేసినట్లు చెప్పాడు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పతనంతో ఒమన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఒమన్ వాసులపై పన్నుల వడ్డనకు దిగింది ఒమన్ ప్రభుత్వం. ప్రధానంగా వలసదారులపై ఒమన్ పన్నుల మోత మోగిస్తుండడంతో, అక్కడి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తక్కువ అద్దె ఉన్న ఇళ్ళ కోసం ఎక్కువమంది చూస్తున్నారు. దాంతో ఎక్కువ అద్దె ఉన్న ఇళ్ళకు గిరాకీ తగ్గింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







