ఈ కారు ఖరీదు రూ.14 కోట్లంట!!
- July 17, 2019
స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైకులు వాడుకలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి. వాటికంటూ కొన్ని స్పెషల్ ఫీచర్లతో తయారు చేస్తాయి కంపెనీలు. అందరి దగ్గరా ఉన్న కారే తమ దగ్గర కూడా ఉంటే స్పెషలేముంది అని అనుకునే వారికి ‘ఎవియా’ కార్‌ని ఎంచుకోమంటోంది బ్రిటన్‌కి చెందిన ఆటో కంపెనీ లోటస్. సాధారణంగా చిన్న స్పోర్ట్స్ కార్లను తయారు చేసే లోటస్.. ఈసారి 2 మిలియన్ డాలర్ల (మన దేశ కరెన్సీలో రూ.13,78,10,000).. 1900 హార్స్ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఫలితంగా ఇది రోడ్ కార్లలో ప్రపంచంలోనే పవర్‌ఫుల్ సిరీస్ మోడళ్లలో ఒకటైంది. మూడే మూడు సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. స్పోర్ట్స్ కార్లను ఇష్టపడే వారికి ఎవియా బాగా నచ్చుతుందని లోటస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ పొఫామ్ అన్నారు. నిజానికి ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ మన్నిక ఇవ్వవని, బ్యాటరీ త్వరగా వేడెక్కిపోతుందని.. అందువల్లే లంబోర్గినీ, ఫెర్రారీ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం లేదని అన్నారు. కానీ తాము మాత్రం సమస్యలన్నింటినీ నివారించుకుంటూ ఎవియా కారుని రూపొందించామన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!