రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రానున్న 48 గంటల్లో తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఒడిశా, బెంగాల్‌ తీరాల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడతాయన్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయన్నారు. వాతావరణ శాఖ అధికారులు సూచనలతో ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Back to Top