కులభూషణ్ పై ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నా - పాక్ ప్రధాని
- July 19, 2019
ఇస్లామాబాద్ : కుల్‌భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసిజెే) ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. జాదవ్‌ను నిర్దోషిగా తేల్చినందుకు, రిలీజ్ చేయమని ఆదేశించనందుకు హర్షిస్తున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా జాదవ్ నేరాలకు పాల్పడ్డారని, ఆ కేసుల్లో అతను దోషిగా ఉన్నాడని ఇమ్రాన్ ఆరోపించారు. చట్టం ప్రకారమే పాక్ ఈ కేసులో ముందుకు వెళ్తుందని ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్ లో తెలిపాడు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన భారత నౌకాదళ విశ్రాంత అధికారి జాదవ్‌ను పాక్ మిలిటరీ కోర్టు దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భారత్‌కు అనుకూలంగా బుధవారం అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ఇచ్చింది. జాదవ్‌కి పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ ఉరిశిక్షపై మరోసారి పరిశీలించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పింది. ఈ కేసులో 16 మంది న్యాయమూర్తుల్లో 15మంది భారత్ వాదనకు మద్దతు పలికారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







