ఆ సైట్లను అలా చూసినా బుక్కవుతారు..
- July 19, 2019
మీరు చూసే అశ్లీల సైట్లలను ఎవరు చూడడం లేదనుకుంటున్నారా? రహస్య శోధన (ఇన్‌కాగ్నిటోమోడ్)లో చూస్తున్నాం వాటిని ఎవరు గుర్తిసారులే అనుకుంటున్నారా?కానీ ఇంటర్నెట్ చూసే ప్రతి ఒక్కటి గూగుల్, ఫేస్‌బుక్ సహా పలు కంపెనీలు పసిగడుతున్నాయి. ప్రైవేట్ బ్రౌజింగ్‌లో చూసే అశ్లీల సైట్లపై అవి కన్నేసి ఉంచాయి.మైక్రోసాఫ్ట్, కార్నిగీ మెలన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చేపట్టిన సంయుక్త అథ్యయనంలో ఈ విషయం బయటపడింది.
“వెబ్ ఎక్స్‌రే” అనే టూల్‌ను ఉపయోగించి 22,484 పోర్న్ వెబ్‌సైట్‌లను పరిశోధించారు. వాటిలో 93 శాతం సైట్లు సమాచారాన్ని థర్డ్ పార్టీ యాప్స్‌కు డేటాను లీకైనట్లు అథ్యయనంలో వెల్లడించారు. ట్రాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత అలవాట్లు, శృంగార ప్రాధాన్యతలు తెలసుకుని ఆయా కంపెనీలకు డేటా అందిస్తున్నారు.
అశ్లీల సైట్స్‌లో దాదాపు 93 శాతం పేజీల యూజర్ డేటాను థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయని, 79 శాతం థర్డ్ పార్టీ కుకీలను కలిగి ఉన్నాయని అథ్యయనం వెల్లడించింది.అశ్లీల సైట్లలో కేవలం 17 శాతం సైట్లు మాత్రమే సమాచార భద్రతను కలిగి ఉన్నాయని రీసెర్చ్‌లో తేలింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







