ఛార్మికి బీరు పోసిన వర్మ(వీడియో)
- July 20, 2019ఎనర్జిటిక్ హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత పూరికి ఓ రేంజ్ హిట్ దొరకడంతో సినిమా యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఏకంగా బీరు బాటిలో తో చీర్స్ కొట్టి.. బాటిల్ లోని బీర్ ను తలమీద పోసుకోవడంతోపాటు ఛార్మి ఒంటిపై పోసి ఆనందించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వర్మ ఆనందం వస్తే మరి ఇంతలా రెచ్చిపోతాడా అని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ కు ముందే తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని ట్వీట్స్ చేశాడు వర్మ. అంతేకాదు బీర్ తెచ్చుకొని సినిమా చూస్తానని చెప్పాడు. మొత్తానికి వర్మ అన్నంత పని చేశాడు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ