యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

యూఏఈలో కొన్ని చోట్ల ఫాగీ కండిషన్స్‌ కన్పించాయి. మరోపక్క, అత్యల్పంగా 23.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అల్‌ హెబెన్‌ మౌంటెయిన్‌ వద్ద ఉదయం 6.45 నిమిషాల సమయంలో నమోదయ్యింది. వాతావరణం పాక్షకంగా మేఘావృతమయి వుంటుంది. కొన్ని చోట్ల క్లౌడ్స్‌ పార్మేషన్‌ కన్పిస్తుందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 44 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్‌లో అత్యధికంగా 43, అత్యల్పంగా 33 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావొచ్చు. అబుదాబీలో 44 మరియు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు 42 మరియు 28గా వుండొచ్చు. అత్యధికంగా హ్యుమిడిటీ 65 శాతం నుంచి 90 శాతానికి చేరుకుంటుందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించింది. గాలుల తీవ్రత గంటకు 40 కిలోమీటర్లుగా వుండొచ్చు. 

Back to Top