300 మందికి పైగా వలసదారుల అరెస్ట్‌

300 మందికి పైగా వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో సుమారు 300 మంది వలసదారుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. రెసిఎన్సీ మరియు లేబర్‌ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్‌ట& చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. మొత్తం 321 మంది వలసదారుల్ని అరెస్ట్‌ చేశామనీ, ఇందులో వివిధ దేశాలకు చెందినవారున్నారనీ, అరెస్టయినవారిలో 12 మంది మహిళలు కూడా వున్నారని అధికారులు పేర్కొన్నారు. లేబర్‌ మరియు రెసిడెన్సీ చట్టాల్ని వీరు ఉల్లంఘించారనీ, అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. కాగా, మరో ఘటనలో రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ 15 మంది మహిళల్ని ఇమ్మోరల్‌ యాక్ట్స్‌కి పాల్పడుతున్నందున అరెస్ట్‌ చేయడం జరిగింది. 

Back to Top