ఒమన్‌లో ఇండియన్ ప్రొఫెసర్‌కి అత్యుత్తమ టీచింగ్ అవార్డ్
- July 30, 2019
మస్కట్: ఒమన్‌లోని ఓ ఇండియన్ ప్రొఫెసర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ బాడీ నుంచి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సుల్తానేట్‌లో టీచింగ్ స్టాండర్డ్స్‌ని పెంచేందుకు ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా ఈ అవార్డు దక్కింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెడ్‌గా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ రిజ్వాన్ పనిచేస్తున్నారు. ఒమన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డ్స్ 2019లో బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ స్టాఇస్టిక్స్ స్టడీస్‌లో అవార్డ్ అందుకున్నారాయన. వలర్డ్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది. 'ఇది బెస్ట్ ప్రొఫెసర్ అవార్డ్. అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఈ అవార్డ్‌కి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది' అని నిర్వాహకులు తెలిపారు. 2003లో ఒమన్‌కి డాక్టర్ రిజ్వాన్ వచ్చారు. అప్పటినుంచీ ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మమేకం అయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







