రస్ అల్ ఖైమాలో ఈ జరీమానాకి 14 రోజుల గ్రేస్ పీరియడ్
- August 01, 2019
డర్టీ నెంబర్ ప్లేట్ లేదా క్లియర్‌గా లేని నెంబర్ ప్లేట్‌తో వాహనాన్ని నడుపుతుంటే, 400 దిర్హామ్‌ల వరకు జరీమానా విధిస్తారు. ఆగస్ట్ 4 నుంచి రెండు నెలలపాటు, ఈ ఉల్లంఘనకు సంబంధించి ఆకస్మిక తనిఖీల్ని నిర్వహించనున్నారు రస్ అల్ ఖైమా పోలీసులు. ఉల్లంఘనకు పాల్పడిన 14 రోజుల్లోగా నెంబర్ ప్లేట్‌ని సరిచేసుకుంటే జరీమానా తప్పుతుంది. 'జరీమానా విధిస్తారు.. అయితే క్షమిస్తారు' అనే ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్ని నివారించే క్రమంలో ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రాపిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కంట్రోల్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ బహ్హార్ చెప్పారు. కాగా, 14 డేస్ గ్రేస్ పీరియడ్ ఆగస్ట్ 4 నుంచి అక్టోబర్ 4 వరకు అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







