రాహుల్ గాంధీ పేరుతో రాహుల్‌కు తప్పని ఇబ్బంది
- August 01, 2019
సెలబ్రెటీల పేర్లు ఉంటే… కొందరికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అయితే… ఒక్కోసారి ఈ సెలబ్రీటల పేరు వల్ల ఇబ్బందులు కూడా తప్పవు. అది అక్షరాలా నిజమంటున్నాడు మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్. ఇండోర్‌లో ఉంటున్న ఈ యువకుడి పేరు రాహుల్ గాంధీ. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేరు ఉండటం..ఇతని చావుకొచ్చింది. రాహుల్ గాంధీ పేరు ఉండటంతో….. ఏ కంపెనీ కూడా అతనికి మొబైల్ సిమ్ ఇవ్వడం లేదు. అతని పేరు చూసినవాళ్లంతా అతనిది దొంగ ఐడీ కార్డు అంటూ అనుమానిస్తున్నారట. అంతే కాదు ఒరిజనల్ పేరు చేప్పాలని అడుగుతున్నారట.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు…. ఇతని ఇంటి పేరు కూడా ఒకటే. దీంతో తాను చాలాఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు రాహుల్‌గాంధీ. కేవలం ఆధార్ కార్డ్ తప్ప ఇంకే గుర్తింపు కార్డు లేదు. సిమ్ కార్డు కొన్నప్పుడు లేదా ఇంకే అవసరాలకైనా ఆధార్ కార్డు చూపిస్తే… అతన్ని అందరూ నకిలీ వ్యక్తని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు రాహుల్. పేరు చెప్పగానే అనుమానంగా చూస్తున్నారంటున్నాడు. ఫోన్లో తన పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు నకిలీ కాల్ అనుకుని పెట్టేస్తున్నారని తన బాధను చెప్పాడు రాహుల్.
నిజానికి ఈ యువకుడి పేరు రాహుల్ మాలవీయ. అయితే ఆయన తండ్రి రాజేశ్ మాలవీయ పార్లమెంటరీ ఫోర్స్‌లో వాషర్‌మ్యాన్‌గా పనిచేసేవారు. అప్పుడు బీఎస్‌ఎఫ్ అధికారులందరూ ఆయన్ను గాంధీ అని పిలిచేవారు. క్రమంగా అదే తమ ఇంటిపేరుగా స్థిరపడిపోయిందట. స్కూల్లో కూడా తన పేరును రాహుల్ గాంధీగానే రిజిస్టర్ చేశారు. అయితే ఇప్పుడు అదే పేరు వల్లే తాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నాడు. అందుకే గాంధీ అనే పదాన్ని తన పేరు నుంచి తొలగించుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు రాహుల్.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







