టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అరెస్ట్ కు రంగం సిద్ధం!
- August 01, 2019
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఓ ప్రముఖ టీవీ చానల్ తమకు రూ. 3.50 కోట్లను ఇవ్వడంలో సురేష్ విఫలం అయ్యారని ఆరోపించగా, కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు ఆరేళ్ల క్రితం హిందీలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ 'బాండ్ బాజా బరాత్' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది హిందీలో సూపర్ హిట్ అయింది. అదే సమయంలో బెల్లంకొండ సురేష్, సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా 'జబర్దస్త్' అనే సినిమాను నిర్మించారు. తమ సినిమాలోని 19 సీన్లను 'జబర్దస్త్'లో కాపీ చేశారని ఆరోపిస్తూ, అప్పట్లోనే యశ్ రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. కాగా, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శాటిలైట్ హక్కులను రూ. 3.50 కోట్లకు బెల్లంకొండ అమ్మేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ హైకోర్టు, చిత్రాన్ని టీవీల్లో సైతం ప్రదర్శించరాదని ఆదేశించింది.
ఆపై సదరు టీవీ చానల్ తాము చెల్లించిన రూ. 3.50 కోట్లను తిరిగి చెల్లించాలని బెల్లంకొండ సురేష్ చుట్టూ ఆరేళ్లుగా తిరుగుతున్నా, ఇవాళ, రేపు అంటూ ఆయన తిప్పించుకున్నారు. దీంతో సదరు చానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో చానెల్ ఇచ్చిన రూ. 3.50 కోట్ల మొత్తం ఇప్పుడు వడ్డీలతో కలిపి రూ. 11.75 కోట్లకు చేరడం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







