కేరళ:ఈ హోటల్లో వృద్ధులకు ఉచిత భోజనం
- August 02, 2019
కేరళ:కాస్త వయసు మీద పడగానే తల్లిదండ్రులను.. పిల్లలు భారంగా భావిస్తున్నారు. రాను రాను వృద్ధాశ్రమాలలో వయోవృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. పిల్లలు ఉన్నతల్లిదండ్రుల పరిస్థితి ఇలా ఉంటే ఇక నిరుపేదలైన, అనాధ వయోవృద్ధుల పరిస్థితి అగమ్యగోచరమే. అయితే అలాంటి వారి కోసం నేనున్నాను అంటూ ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. వారి కోసం ఓ హోటల్‌ను ఏర్పాటు చేశాడు. అది వారిని ఆప్యాయంగా పలకరిస్తుంది. కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తోంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఉన్న కుట్టియాడి గ్రామంలో కండతిల్ అనే హోటల్ ఉంది. దీన్ని బాబు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. 75 ఏళ్లు పైబడిన వృద్ధుల నుంచి పైసా కూడా తీసుకోకుండా వారికి ఉచితంగా భోజనం పెడుతున్నాడు. అలాగే వారికి ఇతర తినుబండారాలు కూడా ఉచితంగా అందిస్తున్నాడు. ఇలా వయోవృద్ధులకు కడుపు నింపడంలోనే తనకు ఆనందమని చెబుతున్నాడు. బాబు చేస్తున్న పనికి ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







