శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
- August 02, 2019
తిరుమల: నవంబరు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. మొత్తం 69,254 టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.టికెట్లను www.tirumala.org వెబ్సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లను విడుదల చేసింది. సుప్రభాతం 7549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2875 టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. దీనిలో విశేష పూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ కోసం 16,800 టికెట్లు విడుదల చేసింది. మరోవైపు జులైలో శ్రీవారికి రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, ఇటీవలి కాలంలో ఇది రికార్డు అని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







