భారీ దాడులకు ప్లాన్ చేసిన జైష్-ఎ-మహ్మద్ తీవ్రవాద సంస్థ
- August 04, 2019
భారత్‌పై దాడే లక్ష్యంగా పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రలు చేస్తున్నారు. తాజాగా టెర్రరిస్టుల కుట్రల్ని మన సైన్యం డీకోడ్ చేసింది. పాక్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ తీవ్రవాద సంస్థ భారీ దాడులకు ప్లాన్ చేసింది. అమర్ నాథ్ యాత్రికులు, భద్రతా దళాలే లక్ష్యంగా మారణహోమం సృష్టించేందుకు కుట్ర చేసింది. ఈకుట్రల గురించి నాలుగు రోజుల క్రితమే నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సైన్యం అలర్ట్ అయింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాల్లోనూ సైన్యం విస్తృతంగా తనిఖీలు చేసింది. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు, బాంబులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది మన సైన్యం..
ఆర్మీ చేసిన డీ కోడ్‌లో.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థలకు ఆ దేశ సైన్యం అండగా నిలిచినట్లు తెలిసింది. పాక్ ఆర్మీ నేతృత్వంలోనే ఈ ఉగ్రవాదల టీంలు రంగంలో దిగినట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. ఇప్పటికే టెర్రరిస్టులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపానికి చేరినట్లు తెలుస్తోంది. జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు ఇబ్రహీం అజర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ కరడుగట్టిన తీవ్రవాది గత నెల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కనిపించినట్లు సమాచారం అందుకున్నప్పటి నుంచే సైన్యం అప్రమత్తమైంది..
ఇబ్రహీం అజర్. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 విమానం హైజాక్ కేసులో కీలక పాత్ర పోషించాడు. తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు బదులు తీర్చుకునేందుకు కాశ్మీర్‌లోకి చొరబడాలని ప్రయత్నిస్తున్నాడు. మన సైన్యంపై దాడులకు అతడే ప్లాన్ చేశాడు. పాక్ టెర్రరిస్టుల కుట్రలను తిప్పికొట్టడానికి మన ఆర్మీ సిద్ధమైంది. కౌంటర్ అటాక్ చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కాశ్మీర్‌లోకి చొరబడే పెషావర్ లాంటి ప్రాంతాలను గుర్తించి తీవ్రవాదుల ఆటకట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు