వాల్‌మార్ట్ స్టోర్ లో కాల్పులు, 20 మంది మృతి
- August 04, 2019
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
వాల్‌మార్ట్ స్టోర్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి జొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో ఈ ఘటనలో గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ మీడియాకు చెప్పారు. సాయుధుడైన నిందితుడు స్టోర్స్ లో జొరబడి కాల్పులకు దిగినట్టుగా ప్రత్యక్షసాక్షులుతెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సాయుధులు కాల్పులు జరుపుతున్న సమయంలో ప్రాణాలు దక్కించుకొనేందుకు భయంతో పరుగులు తీస్తున్నట్టుగా ఆ దృశ్యాల్లో కన్పిస్తున్నాయి. అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో 20 మంది మృతి చెందితే, మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్టుగా స్థానిక అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!