యూఏఈ రాఫెల్ లో 15 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇద్దరు తెలంగాణా వాసులు

- August 05, 2019 , by Maagulf
యూఏఈ రాఫెల్ లో 15 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇద్దరు తెలంగాణా వాసులు

యూఏఈ:మాజీ దుబాయ్‌ రెసిడెంట్‌ అలాగే, అబుదాబీకి చెందిన అతని స్నేహితుడు 15 మిలియన్‌ దిర్హామ్‌లను బిగ్‌ టికెట్‌ అబుదాబీ రాఫెల్ లో గెలుచుకున్నారు. విలాస్‌ రిక్కాల, రవి మాసిపెద్ది.. ఇద్దరూ ఇండియాలోని తెలంగాణకు చెందిన నిజామాబాద్‌ జిల్లా వాసులు. కొంతకాలంగా ఈ ఇద్దరూ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అయితే, జులై 29న కొనుగోలు చేసిన టాక్కెట్‌కి అదృష్టం వరించింది. ఇండియాకి వెళ్ళిపోయిన విలాస్‌ రిక్కాల, తనకు వచ్చిన బహుమతి పట్ల అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్‌లో 4 నుంచి 5 ఏళ్ళు పనిచేశానని ఆయన చెప్పారు. మరోపక్క రవి మాసిపెద్ది మాట్లాడుతూ, చాలా ఏళ్ళుగా తామిద్దరం టిక్కెట్లు కొంటున్నామనీ, ఎట్టకేలకు తమకు బహుమతి లభించిందని అన్నారు. చెరో సగం బహుమతిని తాము పంచుకుంటామని చెప్పారు. కాగా, టాప్‌ 10 విన్నర్స్‌లో ఇండియన్స్‌ ఎక్కువగా వున్నారు. మొత్తం ఐదుగురు బిగ్‌ టికెట్‌ అబుదాబీ రాఫెల్ లో విజేతలుగా నిలిచారు. ఫిలిప్పీన్స్‌ నుంచి ఇద్దరు, ఈజిప్ట్‌ మరియు సోమాలియా నుంచి చెరొకరు విజేతలున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com