ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన రాహుల్‌

- August 06, 2019 , by Maagulf
ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన రాహుల్‌

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 370 రద్దుపై రాహుల్‌ ఎట్టకేలకు మౌనం వీడారు. కశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. జాతీయ భద్రతను సంక్షోభంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను నిర్భందించి... వారిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. భారత దేశం భూములతో నిర్మితం కాలేదని, ప్రజలతో ఏర్పడిందని..ఈ రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని జమ్మూ కశ్మీర్‌ను ఏడిపించడం జాతీయ సమగ్రత అనిపించుకోదు అని ఉద్వేగపూరితంగా ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com