ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని
- August 06, 2019
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్‌లో రగడ చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరుకాలేదు. ప్రధాని గైర్హాజరుపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షం నిరసనతో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో స్పీకర్ కూడా తన ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. సమావేశాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం ఐక్య రాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాకిస్తాన్ విమర్శనాస్త్రాలను అందుకున్నా.. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఓఐసీ) మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా ఫోన్‌లో మాట్లాడినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పాక్‌కు అత్యంత మిత్రదేశమైన చైనా కూడా ప్రకటనలకు దూరంగా ఉంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







