కరివేపాకు ఆకులను నమిలి తింటే..
- August 09, 2019
కరివేపాకును కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కుకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో పలు రకాల ఔషదాలు, పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో మన శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
1. కరివేపాకులో కొవ్వు తగ్గించే గొప్ప గుణం ఉంది. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను పొడిని తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ కూడా గణనీయంగా తగ్గుతుంది.
2. గర్బిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
3. ప్రతిరోజు పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వలన మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
4. పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.
5. కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వలన నొప్పి, గాయం త్వరగా తగ్గుతాయి.
6. కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







