ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రధానం

- August 09, 2019 , by Maagulf
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రధానం

ఢిల్లీ: దేశ‌ అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త ర‌త్నను మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అందుకున్నారు.రాష్ట్ర‌ప‌తి భవన్ లో 2019 సంవత్సరానికి గాను ముగ్గురు ప్రముఖులకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. 

ప్ర‌ణ‌బ్‌తో పాటు సరస్వతి శిశు మందిర్ వ్యవస్థాపకుడు దివంగ‌త శ్రీ నానాజీ దేశ్‌ముఖ్‌, సంగీత విద్వాంసుడు శ్రీ భూపేన్ హ‌జారికాకు ఈ ఏడాది జనవరిలో రాష్ర్టపతి రామ్‌నాథ్‌ భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా తరపున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ తరపున దీన్‌దయాళ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ వీరేంద్రజిత్ సింగ్ భార‌తర‌త్న అవార్డుల‌ను రాష్ర్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. 

భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ ముఖర్జీ కూడా చేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com