ఖతార్ లో సుష్మ స్వరాజ్ కి తెలంగాణ గల్ఫ్ సమితి ఘన నివాళి
- August 10, 2019
ఖతార్:ఈరోజు తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో మన మాజీ విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరగిరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ..సుస్మా స్వరాజ్ గారు చేసిన విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ భారతీయులపై ఆమె చూపిన ఔదార్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,విదేశాలలో ఉన్న ఎన్నారైల పై ఆమె చూపిన చొరవ శోచనీయం.
ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు దౌత్య సంబంధమైన సహాయార్థం "మదద్ "అనే సంస్థ ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది, మరియు కార్మికులకు, విదేశీ కంపెనీలకు మధ్య అనుసంధానంగా "ఈ మైగ్రేట్ "అనే ఆన్లైన్ వ్యవస్థను స్థాపించారు, విదేశాలలో ఉన్న భారతీయులకు ఏ సమస్య వచ్చినా ట్విట్టర్ వేదికగా ఒకే ఒక్క ట్వీట్ ద్వారా సమస్యను తక్షణమే పరిష్కరించిన ఘనత ఆమెకే దక్కుతుంది ఇలా 2014 నుండి 2019 వరకు విదేశాంగ మంత్రిగా ఆమె సేవలు చిరస్మరణీయం.
ఆమె భారతావని ముద్దు బిడ్డ, ధైర్యశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్త్రీ శక్తి, అపార రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకురాలిని మనం కోల్పోయాం...ఆమె అకాల మరణానికి చింతిస్తూ శ్రద్ధాంజలి ఘటించి, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. జోహార్ సుష్మాస్వరాజ్ గారు... ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు మహేందర్,ఎల్లయ్య,వరుణ్ తేజ్,శోభన్,మధు, శేఖర్,శ్రీధర్,రాజు, నారాయణ మరియు సభ్యులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి-ఖతార్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!