మోవాసలాత్‌ మాక్‌ ఫైర్‌ ఎక్సర్‌సైజ్‌

- January 07, 2016 , by Maagulf
మోవాసలాత్‌ మాక్‌ ఫైర్‌ ఎక్సర్‌సైజ్‌

మోవాసలాత్‌ (కార్వా) తమ సిబ్బందికి అగ్ని ప్రమాద సమయాల్లో ఎలా స్పందించాలనే విషయమై అవగాహన కల్పిస్తూ మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించింది. ఈ అవగాహనా కార్యక్రమంలో మోవాసలాత్‌ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాద సమయాల్లో వ్యవహరించాల్సిన విధానం గురించి తెలుసుకున్నారు. మోవాసలాత్‌ అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో పనిచేస్తుందనీ, సిబ్బందికి ఆ తరహా శిక్షణ ఇస్తుందనీ, భద్రత తమ ప్రధాన ఎజెండా అని సంస్థ సిఇఓ ఖాలిద్‌ నజర్‌ అలీ చెప్పారు. ఉద్యోగులను ఒక్క చోట సమావేశపరిచి, వారి నుంచి భద్రత విషయమై సలహాల్ని కూడా స్వీకరించింది సంస్థకు చెందిన పిఆర్‌ డిపార్ట్‌మెంట్‌. రెగ్యులర్‌గా ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు జరుగుతుంటాయనీ, వ్యక్తిగత భద్రతపైనా ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని మోవాసలాత్‌ సిఇఓ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com