విశాఖ హార్బర్‌లో అగ్నిప్రమాదం
- August 12, 2019
విశాఖ:విశాఖ ఔటర్ హార్బర్‌లోని టగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 70శాతం వరకు ఆ టగ్ తగలబడింది. నౌకలో సివిల్ పనుల కోసం సిబ్బందిని తరలిస్తుండగా టగ్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురై సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారి ఆర్తనాదాలు గమనించిన కోస్ట్‌గార్డు సిబ్బంది అప్రమత్తమై వారిని ఓడ్డుకు చేర్చారు. ప్రమాదం సమయంలో టగ్‌లో 29 మంది సిబ్బంది ఉండగా.. 28 మందిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టగ్‌ను జాగ్వార్‌గా గుర్తించారు. చమురు నౌకల్ని బెర్త్ వద్దకు తీసుకురావడం, నౌకలో సిబ్బంది సేవల కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ ఈ టగ్‌ను అద్దెకు తీసుకున్నట్టు సమాచారం.
ఏడుగురి పరిస్థితి విషమం...
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఏసీపీ కులశేఖర్ వెల్లడించారు. మిగతా ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. హెచ్‌పీసీఎల్‌కు చమురు పైపు అనుసంధానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏసీపీ తెలిపారు. సహాయక చర్యల్లో రాణి రోష్మణి, చార్లి సీ432 నౌకలు పాల్గొన్నాయని కోస్టు గార్డు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..