వరద బాధితులకు భారీ సాయం అందించిన బాలీవుడ్ జంట
- August 13, 2019
ముంబై:అందమైన రూపం వుంటే సరిపోదు.. స్పందించే మనసు కూడా ఉండాలని నిరూపించింది నటి జెనీలియా. భర్త రితేష్‌తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. మహారాష్ట్రను ముంచెత్తిన వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని చూసి చెలించిన జెనీలియా దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం మనసును కలచి వేసింది. అందుకే మా వంతుగా వారికి కొంత సాయం చేయాలనుకున్నాము. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి ‘దేశ్ ఫౌండేషన్’ తరపున విరాళం అందించామని రితేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిస్తే ఎంతైనా సాధించవచ్చని రితేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా జెనీలియా, రితేష్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







