గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సి.యం కేసీఆర్
- August 15, 2019
తెలంగాణ:స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణలో జల దృశ్యం ఆవిష్కృతం అవుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని అన్నారు. దాని ఫలాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అదే స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.
బంగారు తెలంగాణ సౌధాన్ని వేగవంతంగా నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పునాదులు పడ్డాయని.. అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గోల్కొండ కోట వేదికగా వివరించారు. బూజు పట్టిన చట్టాల స్థానంలో కొత్తవి తెస్తున్నట్టు చెప్పారాయన. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
తెలంగాణలో సామరస్య జీవనం కొనసాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజల సహకారం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి.. ఆరోగ్య తెలంగాణ సాధించామన్నారు. హైదరాబాద్ ప్రజల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







