సౌదీ జైలులో హక్కుల కార్యకర్తలకు చిత్ర హింసలు
- August 16, 2019
రియాద్: సౌదీ అరేబియా లోని జైలుల్లో మగ్గుతున్న హక్కుల కార్యకర్తలు చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమ కార్యకర్త లౌజాన్ అల్ హత్లౌల్ ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. ఆమె కూడా జైలులో చిత్ర హింసలకు గురయ్యారు. ఎవ్వరైనా విడుదల కోసం అభ్యర్థిస్తే తమపై ఎటువంటి చిత్రహింసలు, లేదా దాడి జరగలేదని వాగ్మూలమివ్వాలంటూ అధికారులు షరతులు పెడుతున్నారని లౌజాన్ తెలిపారు. జైలులో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా ఎటువంటి చిత్రహింసలు జరగలేదని వాగ్మూలమిస్తేనే బెయిల్ ఇస్తామని తమపై ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ఈ షరతుల ఒప్పందాన్ని తాను తిరస్కరించానన్నారు. లౌజాన్ వీడియో ఇప్పుడు సౌదీలో భారీ నిరసన ప్రదర్శనలకు దారితీస్తోంది. మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న హత్లౌల్ తదితర కార్యకర్తలను, ఆమె కుటుంబ సభ్యులను 2018 మే నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







