ఆమె మల్లీ కనిపించింది

- January 08, 2016 , by Maagulf

 

 

ఆమె మల్లీ కనిపించింది  కానీ ఆమె ఆమేనో కాదో, 

నేను చూచిన చోట కాకున్నకాస్త అటు ఇటుగా,

ఒక మోహ ఆకర్షణా' వలయంలో ఆమెను బంధించి లాక్కెళ్ళిన 

ఆ పరిసరాల్లో కాకున్నా, ఎక్కడో ఒకచోట అమెను చూస్తూనే ఉన్నా..  

 

ఆమెవిప్పుడు కరుణా రస పూజల్లుల కాటుక కన్నులో 

పసిడి చాయలో వెలిగే  సాయం సంధ్య లాంటి సౌందర్యమో 

కాదు, మొత్తానికామె తల తల మెరిసిన ఒకప్పటి తారకా,కాదిప్పుడు ..  

 

ఆమె,ఇప్పుడు గింజ తీసి రసాలిన్కిన ఒక వాడిన ఫలంలా, 

జీవిత  అనుభవాల చేదు గురుతులుగా వెండి దారాల్ని తలలో

అలంకరించుకున్న.. కోరికలుడిగిన సన్యాసినిలా  

 

ఎప్పుడో తన  యవ్వన లోకంలో,ఒక బలవత్తరమైన 

మారీచ సమ్మోహన  పొగడ్తకో,కట్టించుకున్న తాళి అలసత్వానికో 

అడుగు తడబడి జీవిత రహదారి ప్రక్క ముళ్ళ కంచెలో పడిపోయి

వాడిపోయిన  ఓ బంతి పూవులా .. 

 

ఎక్కడో నాలుగు గోడల మధ్య నుండి దీనాతి దీనమైన చూపులతో 

వీది గుమ్మాలను వెతుకుతూ ఆత్మీయమైన ఒక పలకరింపు కోసం 

మబ్బు చాటు జాబిల్లిలా,లోకo దృష్టిలో మచ్చ పడిన చంద్రునిలా 

 

ఆమె ఒక నాటి దేవేంధ్ర జాలంలోపడి, బంగపడిన  

ఒక అహల్యలా..శాప విముక్తికి మార్గం ప్రసాదించి,

ఆదరించి అక్కున జేర్చుకునే గౌతముని కోసం 

ఎదురు చూసే ధ్యాన నిమగ్నలా .... కనిపించింది 

 

పాపం ఆమెకేం తెలుసు,అది ధర్మ అధర్మవిచక్షణ నేర్పిన పురాణ 

కాలమని,ఇది అరిషడ్వర్గాలతో అందలమెక్కిన,కలి కాలమని,శరీర వాంఛలతో  

పై పై ప్రేమలతో నాలుగు ప్రేమ వాక్యాలతో హృదిని మభ్యపెట్టి 

తనువుని దోచేసి,మనసుని విరిచేసి,తనను వెలి వేసి,సంఘం 

తన పని తాను చేసుకుంటూ వెళుతుందని,పాపం ఆమెకేం తెలుసు 

 

తెలిస్తే ఎందుకు ఆమె ఎక్కడో ఒక చోట మల్లీ మల్లీ కనిపిస్తూనే ఉంది 

దగా పడిన ఓ దుఃఖ పూరితలా?

 

 

(03-08-2013 ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు మీ జీవితాలు జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం )

 

--జయ రెడ్డి బోడ

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com