ఇస్లామిక్ స్టేట్ అధికార ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డాడు..
- January 07, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధికార ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డాడు. ఇరాక్, అమెరికా కమాండో బలగాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో అతడు పూర్తిస్థాయిలో గాయాలపాలయ్యాడు. దీంతో అతడికి రక్త స్రావం కూడా ఎక్కువగా జరగడంతో రక్తమార్పిడి చేస్తున్నట్లు సమాచారం. అబూ మహ్మద్ అల్ అద్నానీ ఇస్లామిక్ స్టేట్ లో అత్యున్నత స్థాయి హోదాను అనుభవించేవారిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అతడు ఇరాక్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.ఆ సంస్థకు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న అద్నానీ గొంతు ప్రపంచానికి సుపరిచితమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన పలు హెచ్చరికల టేపులు, సందేశాల టేపుల్లో మాట్లాడింది అద్నానీ.తాజాగా, అతడిపై జరిగిన విషయాన్ని ఇరాక్ జాయింట్ ఆపరేషన్స్ కమాండర్ ఒకరు తెలియజేస్తూ గత నెల రోజులుగా తాము అద్నానీ కదలికలను గమనిస్తున్నామని చెప్పారు. గురువారం జరిపిన వైమానిక దాడుల్లో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలిసిందని, రక్తం కూడా చాలా పోవడంతో రక్త మార్పిడి కూడా చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. 2005లో ఒకసారి అద్నానీ అరెస్టు చేసి తీసుకెళ్లిన అమెరికా 2010లో విడుదల చేసింది. అయినా, తీరు మార్చుకోని అద్నానీ పాశ్చాత్య దేశాలకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







