డ్రైవింగ్‌ చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌పై ఆశ వదులుకోవాల్సి0ది..

- January 08, 2016 , by Maagulf
డ్రైవింగ్‌ చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌పై ఆశ వదులుకోవాల్సి0ది..

ఇక మీదట ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌పై ఆశ వదులుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజస్థాన్‌ ప్రభుత్వం నూతన ఆదేశాలను జారీ చేసింది. ఎవరైనా వాహనం నడిపేటప్పుడు ఫోన్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసుల కంట పడితే .. వారికి జరిమానా విధించడంతోపాటు.. వారి ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకుంటారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నియమాన్ని అమలులోకి తెచ్చినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా తెలిపారు. అంతేకాకుండా నాసిరకం హెల్మెట్ల అమ్మకాలను నిలిపివేయాలని.. అలా అమ్మేవారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి 24 వరకు జరిపే రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కొత్త నియమం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత కఠినంగా అమలుచేస్తామని, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఇలాంటి కఠిన నియమాలు తప్పవని అధికారులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com