లయహారి:
- August 23, 2019"లయహారి" అనేది ఒక పద్యలక్షణం. చూడడానికి తేలిగ్గా పాడుకునేలా కనిపిస్తున్నా ఈ లక్షణంలో వ్రాయడం కొంత కష్టమే. కారణం ఏమిటంటే ప్రతి పాదంలోనూ ఆఖరి రెండు అక్షరాలు తప్ప అన్నీ లఘువులే ఉండాలి. ప్రతిపాదంలోనూ 37 అక్షరాలుండాలి. ప్రతి పాదంలోనూ 1,11,21, 31 అక్షరాలకు యతి గానీ, ప్రాసయతి గాని పడాలి. ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం ఒకే అక్షరానికి చెందాల్సిన ప్రాసనియమం సరేసరి. మొత్తానికి ప్రయత్నిస్తే ఇలా తయారయింది.
పద్యం:
అధరములు మెరవగనె వధసలుపనసురులను, కుధరమును కుదుపగనె మధురపులకించెన్
మధురమగు మురళిసడి సుధగమరి కురియగనె బుధజనులు మురియగనె మధురపులకించెన్
వ్యధలణచ మురిపెముగనధనునికి ధనమొసగి మధువులను చిలుకగనె మధురపులకించెన్
దధిచిలికినటులమరి విధివిధము తెలుపగనె గ్రథితమగు కవితలకు మధురపులకించెన్
భావం:
మందహాసంతో పెదవులు మెరిస్తూ ఉండగానే రాక్షసులను చంపగా, గోవర్ధన పర్వతాన్ని కుదిపి ఎత్తగా మధురానగరం పులకించింది. మధురమైన వేణుగానం అమృతంలా కురవగా, సత్పురుషులు ఆనందపడగా మధురానగరం పులకించింది. బాధలను పోగొట్టే విధంగా ప్రేమతో ధనంలేని కుచేలుడికి ధనమొసగగా మధురానగరం పులకించింది. పెరుగు చిలికినంత చక్కగా విధివిధానాలు తెలిపే కవిత్వంతో భగవద్గీతా గ్రంథాన్ని అందించగా మధురానగరం పులకించింది.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!