కాలి బూడిదవుతున్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్
- August 23, 2019
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కాలి బూడిద అవుతోంది. పదిహేను రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్థం అవుతోంది. హెక్టార్ల కొద్దీ చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెజాన్, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని అధికారులు చెబుతున్నారు.
ఈ సీజన్ లో ఇక్కడి అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత కారణంగా అడవిలో మంటలు సాధారణమే. అయితే.. అడవి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సారి రికార్డ్ స్థాయిలో మంటలు చెలరేగాయి. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్‌లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్‌పీఈ వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య 83 శాతం పెరిగింది. మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అడవుల్లో చెట్లను ఇష్టానుసారంగా కొట్టివేయటం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోంది.
రికార్డ్ స్థాయిలో చెలరేగిన కార్చిచ్చు తీవ్రతకు సంబంధించి శాటిలైట్ ఫోటోను ట్వీట్ చేసింది నాసా. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన అమెజాన్ అడవులు ఇప్పుడు పొగతో నిండిపోయాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







