బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్జైట్లీ కన్నుమూత
- August 24, 2019
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు.
1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ నుంచి డిగ్రీ, న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో అభ్యసిస్తున్న సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్న ఈయన 19 నెలలు జైలుకు వెళ్లి వచ్చారు. 1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పని చేశారు.
వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా నియమించారు. మోడీ హాయాంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యం కారణంగా జైట్లీ ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మే 14వ తేదీన రెనాల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. 2018 ఆగస్టు 23వ తేదీన ఆర్థిక శాఖను ఆయన చేపట్టారు. 2019 మే నెల నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక శాఖను చూస్తున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







