వినువీధుల్లో ఆక్సిడెంట్...ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి

- August 27, 2019 , by Maagulf
వినువీధుల్లో ఆక్సిడెంట్...ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో విమానం, హెలికాప్టర్‌ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మలోర్కా ద్వీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. జర్మనీకి చెందిన ఈ హెలికాప్టర్‌ మలోర్కా ద్వీపం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న విమానాన్ని ఢకొీట్టింది. దీంతో, ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు ప్రయాణికులు, విమానం పైలట్‌ సహా ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విమాన ప్రమాదంపై స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాన్‌చెజ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com