2020లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్‌లో ప్రారంభం
- August 27, 2019
2020 సెప్టెంబర్‌లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్‌లో ప్రారంభం కానున్నాయి. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఈ వివరాల్ని వెల్లడించింది. ఈ స్కూళ్ళలో 13,000 మందికిపైగా విద్యార్థులకు చోటు లభిస్తుందని అధికారులు వివరించారు. కెహెచ్‌డిఎ పర్మిట్స్ అండ్ కాంప్లియన్స్ సిఇఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ కొత్త స్కూళ్ళ ప్రారంబంతో దుబాయ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభమవుతున్న స్కూల్స్ అల్ త్వార్ 2, అల్ కుసైస్, జుమైరా విలేజ్ ట్రయాంగిల్, అల్ కోజ్ మరియు జబెల్ అలి తదితర ప్రాంతాల్లో వున్నాయి. 2008లో 38గా వున్న స్కూళ్ళ సంఖ్య ఇప్పుడు 119కి పెరిగిందని దార్వష్ వివరించారు. గత మూడేళ్ళలో కొత్తగా 41 స్కూల్స్ ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







