ఐదు రోజులుగా పెరుగుతున్న పసిడి ధర..

- January 08, 2016 , by Maagulf
ఐదు రోజులుగా పెరుగుతున్న పసిడి ధర..

 పసిడి ధర పైపైకి పోతోంది. వరసగా ఐదు రోజులుగా పెరుగుతూనే ఉంది. గురువారం రూ.26,000 మార్కును దాటిన బంగారం ధర ఈ రోజు మళ్లీ రూ.20 పెరిగింది. దీంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,350కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు స్థిరంగా ఉండటం తదితర కారణాల వల్ల దీని ధర పెరుగుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,109.20 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. ఈ రోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.100 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 34,100కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 14.31 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com