వాట్సాప్‌లో థీమ్ ఛేంజ్!
- August 28, 2019
రోజురోజుకూ కొత్త అప్డేట్స్తో వినియోగదారులను మరింత మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్‌లో సరికొత్త అప్డేట్ ఇవ్వనుంది. ఇన్నాళ్లు వాట్సప్‌లో వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ మార్చుకోవచ్చట. థీమ్ గురించి అందరికీ తెలిసిందే.
కేవలం వాల్ పేపర్ మార్చుకుంటే చాటింగ్ వెనుక స్క్రీన్ మాత్రమే ఫొటో అయినా డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అయినా సెట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు థీమ్ ఛేంజ్ వస్తే థీమ్‌ను బట్టి ఐకాన్‌లలోనూ మార్పును గమనించవచ్చు. అంతేకాదు, దీంతో పాటు వాట్సప్ స్టిక్కర్లను యాప్‌లోనే ఉండేలా.. అంటే ఈమోజీలలాగే వాడుకునేంత సౌకర్యం కల్పించనున్నారు.
ఇప్పటికే టెస్ట్ వెర్షన్ లా గ్రీన్ కలర్ థీమ్ ను విడుదల చేసిన వాట్సప్ స్పందనను బట్టి ఆండ్రాయిడ్ వర్షన్లలోనూ దీనిని అందించేందుకు కృషి చేస్తుంది. సోషల్ మీడియాకు అనుగుణంగా అప్డేట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా థీమ్స్ మార్చుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్లాగులో రాసుకుకొచ్చింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







