ఖతార్‌లో తొలి వర్చువల్‌ స్టోర్‌ని ప్రారంభించిన ఊరెడూ

- August 28, 2019 , by Maagulf
ఖతార్‌లో తొలి వర్చువల్‌ స్టోర్‌ని ప్రారంభించిన ఊరెడూ

వినియోగదారులకు కొత్త షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఊరెడూ ఖతార్‌, తొలి వర్చువల్‌ స్టోర్‌ని ప్రారంభించింది. అబ్సెస్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే పార్టనర్‌తో కలిసి న్యూ వర్చువల్‌ స్టోర్‌ అలాగే త్రీడీ రిటెయిల్‌ ఎక్స్‌పీరియన్స్‌ని వినియోగదారులకు అందించనుంది. ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా యూజర్స్‌ వర్చువల్‌గా లుక్‌ అరౌండ్‌ చేయొచ్చు. ఓరెడూ ప్రాడక్టుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని, వాటిని కొనుగోలు చేయడానికి వీలుంది. యాపిల్‌, శామ్‌సంగ్‌, హుయేయి ప్రోడక్టులను పలు ప్యాకేజీలలో సొంతం చేసుకోవచ్చు. ఓరెడూ వర్చువల్‌ స్టోర్‌, 360 డిగ్రీ ఇంటరాక్టివ్‌ షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని వినియోగదారులకు అందిస్తుంది. మొబైల్‌ డివైజ్‌, స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌ లేదా ల్యాప్‌టాప్‌ అలాగే రెగ్యులర్‌ డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ ద్వారా స్టోర్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com