విదేశీయుల్ని పెళ్ళి చేసుకున్న కువైటీ మహిళల సంఖ్య 249,000

- September 03, 2019 , by Maagulf
విదేశీయుల్ని పెళ్ళి చేసుకున్న కువైటీ మహిళల సంఖ్య 249,000

కువైట్‌: అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది డిసెంబర్‌ వరకు మొత్తం 249,000 మంది కువైటీ మహిళలు, ఇతర దేశాలకు చెందిన పురుషుల్ని పెళ్ళాడారు. కాగా, 433,000 మంది కువైటీ పురుషులు, ఇతర దేశాలకు చెందిన మహిళల్ని వివాహం చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ) వెల్లడించిన వివరాల ప్రకారం 2.2 మిలియన్‌ మందిలో 1.6 మిలియన్‌ మంది వలసదారులు, 1.5 మిలియన్‌ పెళ్ళికానివారు, 94,806 వివాహాలు డివోర్స్‌తో రద్దయ్యాయనీ, 38,881 మంది మహిళలు విడోస్‌గా మారారని తెలుస్తోంది. కాగా, 735 మంది కువైటీ మహిళలు ఆసియాకి చెందిన పురుషుల్ని పెళ్ళాడారు. వీరిలో 128 మందికి పిల్లలు లేరు. కాగా, నార్త్‌ అమెరికన్లను పెళ్ళి చేసుకున్న కువైటీ మహిళల సంఖ్య 334గా వుంది. 57 మంది సౌత్‌ అమెరికన్లను పెళ్ళాడారు. 36 మంది ఆస్ట్రేలియన్లను, 33 మంది ఆఫ్రికన్లను పెళ్ళి చేసుకున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com