సలాలాలోని ఓ క్లాస్‌రూమ్‌లో అగ్ని ప్రమాదం

- September 03, 2019 , by Maagulf
సలాలాలోని ఓ క్లాస్‌రూమ్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: ఓ క్లాస్‌ రూమ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, సకాలంలో ఫైర్‌ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేశారు. దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్‌ ఫైటర్స్‌ సకాలంలో మంటల్ని ఆర్పివేశారనీ, ఓ ఎయిర్‌ కండిషనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. విలాయత్‌ సలాలాలోని స్కూల్‌లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com